Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో నలుగురి కిడ్నాప్

Advertiesment
బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో నలుగురి కిడ్నాప్
, మంగళవారం, 1 మార్చి 2022 (21:59 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జితేందర్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో నలుగురు కిడ్నాప్‌కు గురయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉండే వారిలో ఏకంగా నలుగురు కిడ్నాప్‌కు గురికావడం ఇపుడు కలకలం రేపుతుంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కిడ్నాప్‌కు గురైనవారిలో జితేందర్ రెడ్డి కారు డ్రైవర్‌తో సహా నలుగురు ఉన్నారు. ఈ కిడ్నాప్ ఘటనపై జితేందర్ రెడ్డి ఢిల్లీ ఫిర్యాదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీ సౌత్ అవెన్యూలోని 105 నంబరు ఇంటిలో జితేందర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి జితేందర్ రెడ్డి కారు డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది సమీపంలోని పోలీస్ స్టేషనుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుతిన్ లెక్క తప్పింది.. తోకముడుచుకోవడం బెస్ట్ : బ్రిటన్ ప్రధాని