Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరీంనగర్‌లో కారు బీభత్సం... నిద్రిస్తున్న నలుగురు మృతి

Advertiesment
కరీంనగర్‌లో కారు బీభత్సం... నిద్రిస్తున్న నలుగురు మృతి
, ఆదివారం, 30 జనవరి 2022 (09:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. స్థానిక కమాన్ చౌరస్తాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ గుడిసెపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఓ గుడిసెలో నిద్రస్తున్న వారే కావడం గమనార్హం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
 
ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను ఫరియాద్, సునీ, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రెజరీ ఉద్యోగులంతా ఆదివారం కూడా పనిచేయాలి : ఏపీ సర్కారు