Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎఫ్ఎంసి ఇండియా, నారాయణ్‌పేట్‌లో సామూహిక నీటి వడబోత ప్లాంటును హనుమకొండలో నెలకొల్పుతోంది

image
, శుక్రవారం, 6 జనవరి 2023 (21:19 IST)
వ్యవసాయ సమాజాలను మరింత సుస్థిరత్వం చేయాలనే తన నిబద్ధతలో భాగంగా, FMC కార్పొరేషన్, భారతదేశ రాష్ట్రమైన తెలంగాణలోని హనుమకొండ జిల్లాలోని రామనగర్ గ్రామములో ఒక కొత్త నీటి వడబోత (శుద్ధి) ప్లాంటును నెలకొల్పుతున్నట్లుగా ఈరోజు ప్రకటించింది. ఈ చొరవ కార్యక్రమం, ఇండియాలో FMC యొక్క కమ్యూనిటీ ఔట్‌రీచ్ ప్రోగ్రాము అయిన ప్రాజెక్ట్ సమర్థ్ యొక్క భాగంగా ఉంది, అది వ్యవసాయ కుటుంబాల కొరకు పరిశుభ్రమైన, త్రాగునీటిని అందించాలని ఆశిస్తోంది.

ఈ ప్లాంటు గంటకు 500 లీటర్ల శుద్ధి చేసిన త్రాగునీటిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు గ్రామములోని 500 కు పైగా కుటుంబాలకు సురక్షిత త్రాగునీటి ఆవశ్యకతను తీర్చగల సమర్థత కలిగి ఉంది. ఈ క్రొత్త నీటి సరఫరా వ్యవస్థ నీటి జనిత వ్యాధులను తగ్గించగలుగుతుందనీ మరియు గ్రామస్థుల ఆరోగ్యం పట్ల గణనీయమైన వ్యత్యాసం చేయగలుగుతుందనీ ఆశించబడుతోంది.
 
“ప్రాజెక్ట్ సమర్థ్ అనేది భారతీయ రైతులు మెరుగైన జీవన ప్రమాణాలతో మరియు వారి కుటుంబాలు సుస్థిరత్వంగా జీవించడం పట్ల మా నిబద్ధత యొక్క వ్యక్తీకరణగా ఉంది," అన్నారు FMC ఇండియా అధ్యక్షులు శ్రీ రవి అన్నవరపు గారు. “2019 నుండీ, FMC ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్ఱాల వ్యాప్తంగా 60 కి పైగా నీటి శుద్ధి ప్లాంటులను నెలకొల్పింది. అనేక సంవత్సరాలుగా అందుకోబడుతున్న సానుకూల స్పందనతో, ఈ చొరవ కార్యక్రమం ఇప్పుడు మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల గ్రామాలకు విస్తరించబడుతూ ఉంది. ఈ నీటి శుద్ధి ప్లాంటులు రాబోయే కాలములో గ్రామాల యొక్క ఆరోగ్య సూచికలో ప్రత్యక్షంగా సానుకూలమైన వ్యత్యాసాన్ని చేయగలవని మేము నమ్ముతున్నాము. 2023 నాటికి దేశవ్యాప్తంగా 3 లక్షల రైతు కుటుంబాలకు సురక్షితమైన మరియు వాడుకోదగిన త్రాగునీటికి ప్రాప్యత కలిగించాలని మేము లక్ష్యంగా చేసుకున్నాము” అన్నారు.
 
ప్రాజెక్ట్ సమర్థ్ క్రింద ఒక లబ్దిదారుగా రిజిస్టర్ చేసుకున్న ప్రతి కుటుంబమూ ఒక "ఎనీ టైమ్ వాటర్" (ATW) స్వైప్ కార్డును అందుకుంటుంది, అది ఒక్కొక్క స్వైప్ తో 20 లీటర్ల నీటిని విడుదల చేస్తుంది. పరిశుభ్రమైన త్రాగునీటి ప్రమాణాలను నెరవేర్చే త్రాగునీటి యొక్క ప్రయోజనాల గురించి గ్రామస్థులలో అవగాహన పెంచడానికి గాను FMC ఇంటింటికీ ప్రచారోద్యమం చేపట్టడంలో కూడా చురుగ్గా పాలు పంచుకుంటోంది.
 
హనుమకొండ జిల్లా రామనగర్ గ్రామములో కొత్త నీటి శుద్ధి ప్లాంటు, గ్రామ సర్పంచ్ శ్రీ. బుక్యా కవిత గారు, మాజీ ఎంఎల్ఏ శ్రీ. ఏ. ప్రవీణ్ గారు, కమ్యూనిటీ డెవలెప్‌మెంట్ ఫౌండేషన్ జెనరల్ మేనేజర్ శ్రీ. జూపల్లి పురుషోతం రావు గారు  మరియు FMC ఇండియా మరియు కమ్యూనిటీ అభివృద్ధి బృందాలచే ప్రారంభోత్సవం గావించబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోళ్లు ఎందుకు కొరుకుతారు?