తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఖమ్మం పట్టణంలోని వైరా రోడ్డులో సీఆర్‌జీ టవర్స్‌లో ఉంటున్న ఫ్యామిలీకి చెందిన 21ఏళ్ల యువతికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంకు చెందిన యువతి హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఓ కాలేజీలో చదువుకుంటోంది. కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లింది.
ఈ నెల 19వ తేదీన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కరోనా టెస్టుకు శాంపిల్ ఇచ్చింది. అయితే ఆమెలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో అధికారులు ఆ శాంపిల్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. అక్కడ పరీక్షించిన వైద్య నిపుణులు ఆమెకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారించారు.
దీంతో అప్రమత్తమైన ఖమ్మం అధికారులు ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్ కింద యువతి కుటుంబసభ్యులకూ పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారి శాంపిళ్లను కూడా ల్యాబ్‌కు పంపారు.