Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు దుబ్బాక ఫలితం... 8.30 గంటలకు తొలి రౌండ్‌ ఫలితం

నేడు దుబ్బాక ఫలితం... 8.30 గంటలకు తొలి రౌండ్‌ ఫలితం
, మంగళవారం, 10 నవంబరు 2020 (07:01 IST)
కౌంట్‌డౌన్‌ స్టార్టయ్యింది.. కోట్లాది మంది ఎదురు చూస్తున్న దుబ్బాక ఫలితానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది..  తెలంగాణ  ఏకైక ఉప ఎన్నిక కావడంతో అంతటా ఆసక్తి నెలకొన్నది. అందరి చూపు ఇటువైపే మళ్లింది. 
 
ఈ నెల 3వ తేదీన పోలింగ్‌ జరుగగా ఈనెల 10న అంటే మంగళవారం అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూరు  ఇంజనీరింగ్‌ కళాశాలలో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. 
 
తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. అరగంట తర్వాత ఈవీఎంలను ఓపెన్‌ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గెలుపోటములపై స్పష్టత ఏర్పడుతుంది. 
 
14 టేబుళ్లు.. 23 రౌండ్లు
కౌంటింగ్‌లో భాగంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ టేబుళ్లపై 23 రౌండ్లపాటు ఈవీఎంలను లెక్కిస్తారు. దుబ్బాక నియోజకవర్గంలోని 315 పోలింగ్‌ కేంద్రాల్లో 1,64,192 ఓట్లు పోలయ్యాయి. ఈవీఎంలను ఓపెన్‌ చేయడం, వాటిని లెక్కించడం త్వరత్వరగానే పూర్తవుతాయి.

ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా 1,453 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, 51 సర్వీస్‌ ఓట్లు ఉన్నాయి. వీటిని ముందుగానే లెక్కించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాల సీఐ, హెడ్‌ కానిస్టేబుళ్ళ బెయిల్‌ రద్దు చేయాలంటూ కోరిన జగన్‌