Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమజాహితం కోసం బ్రహ్మకుమారిల కృషి అభినందనీయం: మంత్రి పువ్వాడ

సమజాహితం కోసం బ్రహ్మకుమారిల కృషి అభినందనీయం: మంత్రి పువ్వాడ
, సోమవారం, 9 నవంబరు 2020 (22:02 IST)
సమాజ హితం కోసం ఈశ్వరియా బ్రహ్మకుమారిల కృషి అభినందనీయమని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి నందు నూతనంగా నిర్మించిన  బ్రహ్మకుమారి సమాజ్ భవనాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సతీమణి పువ్వాడ వసంతలక్ష్మితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఆధునిక జీవన విధానానికి మనిషి తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యాలకు గురి అవుతున్నడని అన్నారు. తద్వారా మానవ మనుగడ ప్రశాంర్ధకంగా మారిందని, జీవితానికి ప్రశాంత ఎంతో అవసరమని అలాంటి వారి కోసమే బ్రహ్మకుమారులు తమ మంచి సూక్తులు, ప్రశాంత జీవన విధానం తీరును బొడిస్తూ మనందరికీ మానసిక ధైర్యం నింపుతున్నారని అన్నారు.

ముఖ్యంగా ధాన్యంతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, ధ్యానం అనేది ఒక మానసిక సత్ప్రవర్తన అని వివరించారు. వాటిని అనుసరించటం ద్వారా సాధకుడు ప్రతీకార, యోచన బుద్ధి నుంచి అమితమైన విశ్రాంతి, స్పృహను పొందడం వల్ల మంచి జీవన ప్రమాణాలు పొందుతారని పేర్కొన్నారు. 

ధ్యానం ఒక ఆరోగ్యకరమైన అధ్యయనమని, దీనిని పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నాట్లు పలు అధ్యయనాలు చెబుతున్నామని వివరించారు. అలాగే దీనిని మత సంప్రదాయాలకు అతీతంగా కూడా సాధన చేస్తున్నారని తద్వారా ఒత్తిడిని జయించి ప్రశాంతమైన మనసును పొందవచ్చన్నారు.

మనస్తత్వభౌతిక సాధనలు విభిన్న ధ్యాన సత్ప్రవర్తనలుగా ఉంటాయని, వీటి ద్వారా అత్యుత్తమ చైతన్య స్థితిని పొందడం మొదలుకుని అత్యధిక ఏకాగ్రత, సృజనాత్మకత, స్వీయ-స్పృహ లేదా సాధారణంగా ఒక విశ్రాంత , ప్రశాంతమైన మనస్సును పొందడం వంటి లక్ష్యాలను సాధించవచ్చుని అన్నారు. వారు సమాజానికి తమ వంతు పాత్రను నిర్వర్తిస్తు సమజహితం, ఆరోగ్య సమాజం కోసం చేస్తున్న కృషిని అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చారు: దివ్యవాణి