Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

వరంగల్‍‌లో దారుణం : అన్నవదిన - బావమరిదిని హత్య చేసిన తమ్ముడు

Advertiesment
Warangal
, బుధవారం, 1 సెప్టెంబరు 2021 (09:11 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కుటుంబ విభేదాల కారణంగా ఓ వ్యక్తి తన అన్న, వదినలతో పాటు.. బావమరిదిని దారుణంగా హత్య చేశాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఈ వివరాలు ఇలా వున్నాయి. వరంగల్ ఎల్బీనగర్‌కు చెందిన మహమ్మద్ చాంద్‌బాషాకు, అతడి తమ్ముడు షఫీకి మధ్య పశువుల వ్యాపారానికి సంబంధించి ఏడాదిగా గొడవలు జరుగుతున్నాయి. 
 
దాదాపు కోటి రూపాయల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ విషయంలో అన్నపై విపరీతమైన ద్వేషం పెంచుకున్న షఫీ.. అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
 
బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరికొందరితో కలిసి అన్న చాంద్‌బాషా ఇటికి చేరుకున్న షఫీ.. ఇంటి తలుపులను కట్టర్ సాయంతో తొలగించి లోపలికి ప్రవేశించాడు. నిద్రిస్తున్న బాషా, ఆయన భార్య సమీరా బేగం, కుమారులు, బావమరిది ఖలీంపై కత్తులతో దాడి చేశారు.
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాషా, సమీరా బేగం, ఖలీం అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారి ఇద్దరు కుమారులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. షఫీయే తన తల్లిదండ్రులపై దాడిచేసి చంపేసినట్టు బాషా కుమార్తె పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు ముఖ్యమంత్రి అయి పాతికేళ్లు