డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన టెక్కీ మృతదేహాన్ని గోల్డెన్ టెంపుల్‌కు సమీపంలో ఉన్న నెక్నంపూర్ చెరువులో పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మణికొండలో నివాసముండే గోపిశెట్టి రజనీకాంత్ (42) షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్ తన ఇంటికి 50 మీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యాడు. ఇలా మణికొండలో నాలాలో శనివారం కొట్టుకుపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతదేహం లభ్యమైంది.
రజనీకాంత్ డ్రైనేజీలో కొట్టుకుపోయారనే సమాచారంతో రెండు డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయచర్యల్లో పాల్గొన్నాయి. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్ చెరువు వద్ద గాలింపు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం చెరువులో ఆయన మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గుర్తించి వెలికితీశారు. రజనీకాంత్ కోసం రెండ్రోజులుగా 60 మంది సిబ్బంది గాలింపు చేపట్టారు.