కరోనా వైరస్‌ సోకి మహిళ మృతి .. 800 మంది కార్మికులకు క్వారంటైన్

ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (14:12 IST)
కరోనా వైరస్ సోకి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ కాలనీలోని 800 మంది కార్మికులను పోలీసులు హోం క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామ పరిధిలోని కన్హా శాంతివనం అనే కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కన్హా శాంతివనంలో వందలాది మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వీరిలో ఓ మహిళకు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ శాంతివనంను సందర్శించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా శాంతివనంలో పని చేసే 800 మంది కార్మికులను హోంక్వారంటైన్‌కు తరలించాలని ఆదేశించారు. 
 
కలెక్టర్ ఆదేశాల మేరకు చేగూరు గ్రామ సరిహద్దులో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. గ్రామంలో ఇంకెవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా అని తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఏటీఎం కేంద్రంలో ఉమ్మేసిన కరోనా వైరస్ రోగి... ఖాకీల సీరియస్