Publish Date: Tue, 14 Dec 2021 (07:31 IST)
Updated Date: Tue, 14 Dec 2021 (07:33 IST)
తమిళనాడు రాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్‌తో భేటీకానున్నారు. ఈ భేటీ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగే అవకాశం ఉంది. ఇందులో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.
సోమవారం కుటుంబ సమేతంగా తిరుచ్చిలోని శ్రీరంగనాథ స్వామి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్.. తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆయన ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయ ప్రత్యేకతను వివరించారు.
ఆ తర్వాత ఆయన సోమవారం సాయంత్రానికి చెన్నైకు చేరుకున్నారు. రాత్రికి ఐటీసీ చోళా నక్షత్ర హోటల్‌లో బస చేశారు. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్‌తో సమావేశం కానున్నారు.
ఈ భేటీ సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని సమాచారం. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, భవిష్యత్ వ్యూహాల గురించి చర్చించనున్నట్టు సమాచారం.