తెలంగాణ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించాలని చూస్తుంది. ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు సైతం ఈసారి తెలంగాణలో అధికారం చేపట్టాలని తహతలాడుతున్నాయి.
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సైతం గత వారం రోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. 95 నుంచి 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని కేసీఆర్ ప్రకటించారు. 
	 
	గజ్వేల్ నియోజకవర్గానికి ప్రతినెలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని, నియోజకవర్గంలో బహుళ అభ్యర్థులు ఉండాలన్నదే తన ధ్యేయమని ఉద్ఘాటించారు. గజ్వేల్‌ను వదలబోనని, ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.