Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోశాలపై దాడి చేసి గోవులను, 25 ఎద్దులను అపహరించిన పశువుల మాఫియా

గోశాలపై దాడి చేసి గోవులను, 25 ఎద్దులను అపహరించిన పశువుల మాఫియా
, మంగళవారం, 25 జనవరి 2022 (20:51 IST)
గత రాత్రి సుమారు 2 గంటలకు పశువుల మాఫియాకు చెందిన కొంతమంది దుండగులు హైదరాబాద్‌ నగర శివార్లలోని  జీయర్‌ స్వామి ధ్యాన్‌ ఫౌండేషన్‌ (జెఎస్‌డీఎఫ్‌)పై దాడి చేయడంతో పాటుగా 20 నుంచి 25 ఎద్దులను ఎత్తుకుపోయారు. ఇవన్నీ కూడా పశువుల అక్రమ రవాణాలో గతంలో పట్టుకున్నవే కావడం గమనార్హం. ఈ పోకిరీలు గోశాల బయట టపాసులు కాల్చడం ద్వారా పశువులను భయపెట్టడంతో పాటుగా గోశాల గోడలను పగుల కొట్టి అక్రమంగా ఈ పశువులను తరలించుకుపోయారు.

 
ఈ దుండగులకు పోలీసులు కూడా సహకరించారని గోశాల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ దుండగుల చర్యలకు ముందు అంటే అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ దుండగులతో పాటుగా ఇద్దరు పోలీసు అధికారులు గోశాల బయట నిల్చుని రభస సృష్టించడంతో పాటుగా గోశాల కార్మికులు, సిబ్బందిని భయపెట్టారని అంటున్నారు. వీరంతా కూడా ట్రక్కులతో రావడంతో పాటుగా ఆ సమయంలో కొన్ని ఎద్దులను తమకు అప్పగించాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు చెప్పారు.

 
ఓ కేసులో పట్టుబడిన గోవులు కావడంతో వాటిని కోర్టు ఉత్తర్వులు లేకుండా విడుదల చేయలేమని, దానికి తోడు ఆ గోవులు ప్రయాణించేందుకు తగిన ఆరోగ్యంతో ఉన్నాయని వెటర్నరి డాక్టర్‌ ధృవీకరణ కావాల్సి ఉంటుందని సిబ్బంది చెప్పినప్పటికీ వినకుండా సిబ్బందిని తీవ్ర పదజాలంతో హెచ్చరించడంతో పాటుగా పోలీసులతో కలిసి గోశాల గోడలు పగలగొట్టి తీసుకువెళ్తామని హెచ్చరించి, అన్నంత పనీ చేశారు.

 
దాదాపు 650కు పైగా ఆవులు, ఎద్దులు, గిత్తలకు నిలయం జెఎస్‌డీఎఫ్‌ గోశాల. అక్రమ రవాణాలో అడ్డుకున్న పశువులతో పాటుగా పశువధ శాలల వద్ద అక్రమంగా చంపబడుతున్న గోవులను అడ్డుకుని ఇక్కడ సంరక్షిస్తున్నారు. దాదాపు 9 సంవత్సరాలుగా ధ్యాన్‌ ఫౌండేషన్‌ ఈ సహ్యోగ్‌ నందిశాలను నిర్వహిస్తుంది. ఈ గోశాలలో పశువుల సంఖ్య పెరగడంతో గత నవంబర్‌లో జెవైడీఎఫ్‌ గోశాల ప్రారంభించింది.

 
పశు మాఫియాను కూకటివేళ్లతో సహా పెకిలించాలనే సంకల్పంతో తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే కోట్లాది డాలర్ల వ్యాపారంతో ముడిపడిన మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతుందనీ, నిన్న తమ గోశాల మీద దాడి చేశారని చెప్పారు. అంతకుముందు జంతుసంరక్షణ ఉద్యమకారుల కారును ఢీకొట్టి ఇద్దరిని చంపడంతో పాటుగా మరో ఇద్దరు ప్రాణాల కోసం పోరాడేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ధ్యాన్‌ ఫౌండేషపన్‌ వలెంటీర్లు ఇదే తరహా సంఘటనలు ఎన్నో ఎదుర్కొంటున్నారనీ, పలు స్టేషన్‌లలో ఈ విషయమై కేసులు పెడుతున్నప్పటికీ ఈ మాఫియాకు చెందిన ఏ ఒక్కరి అరెస్ట్‌ జరుగడం లేదని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిస్టర్‌పై ఫాదర్ రాసలీలలు.. పెళ్లి పేరుతో లొంగదీసుకుని..?