Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గో ఆధారిత రైతులకు ఆవులు, ఎద్దులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయండి : టీటీడీ ఈవో

Advertiesment
cows
, శనివారం, 13 నవంబరు 2021 (18:11 IST)
గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ ద్వారా గోవులు, ఎద్దులు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శనివారం గో శాలలో ఆయన గో పూజ చేశారు. గోవు, దూడకు పసుపు, కుంకుమ, పూలమాలలు, నూతన వస్త్రాలు సమర్పించి శాస్త్రోక్తంగా పూజ చేశారు. అనంతరం గోవు, దూడకు దాణా,గ్రాసం అందించారు.

అనంతరం ఈవో  అధికారులతో మాట్లాడుతూ, తిరుపతి, పలమనేరు గోశాలల నుంచి సుమారు 330 గోవులు, ఎద్దులు రైతులకు ఉచితంగా అందించినట్లు చెప్పారు. రైతులు ఉచితంగా అందుకున్న గోవులు, ఎద్దుల పోషణకు సంబంధించి మార్గదర్శకాలు తయారుచేసి రైతులకు వివరించాలని చెప్పారు.

జెఈవో వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ డైరెక్టర్ డాక్టర్ జి.వెంకటనాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని సందర్శించారు. ఐసియు లో చికిత్స పొందుతున్న బాలిక కవిత తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి ఇంకా రావాల్సిన సూక్ష్మ యంత్ర పరికరాలు త్వరగా సమకూర్చుకోవడానికి వెంటనే టెండర్లు పిలవాలని 
అధికారులను ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14 నుంచి విద్యార్థిని విద్యార్థులకు పోటీలు