Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జన జాతరలా అమరావతి రైతుల మహాపాదయాత్ర

Advertiesment
జన జాతరలా అమరావతి రైతుల మహాపాదయాత్ర
, బుధవారం, 10 నవంబరు 2021 (22:18 IST)
అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో జన జాతరలా సాగుతోంది. ఊరూరా ప్రజలు కదలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.

పూలజల్లులు, మేళతాళాలు, కళాప్రదర్శనలతో వేలాది మంది పాదయాత్రకు మద్దతుగా నడుస్తున్నారు.

ఈ నెల 1న అమరావతిలో జేఏసీ ప్రారంభించిన మహాపాదయాత్ర పదోరోజైన బుధవారం మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 కి.మీ సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

జిల్లాలోని టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ స్వామిలతోపాటు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పాదయాత్రలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.

గత రాత్రి బస చేసిన పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరులో బుధవారం ఉదయం జేఎసీ నేతలతో కలిసి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు యాత్రను ప్రారంభించారు.

ఆ గ్రామంతోపాటు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపి యాత్రలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన