Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14 నుంచి విద్యార్థిని విద్యార్థులకు పోటీలు

Advertiesment
Competitions
, శనివారం, 13 నవంబరు 2021 (18:08 IST)
ఆదివారం నుంచి నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాలలో జూనియర్, సీనియర్ విద్యార్థిని, విద్యార్థులకు వివిధ అంశాలపై క్విజ్, దేశ భక్తి గేయాలు,  వ్యాస రచన, వకృత్వా, చిత్రలేఖనం విభాగాల్లో పోటీలు  నిర్వహించడం జరుగుతుందని కొవ్వూరు బ్జిల్లా శాఖ  గ్రంథాలయాధికారి ఙివివి ఎన్. త్రినాధ్ తెలిపారు.

వివిధ పాఠశాలల్లో చదువుతున్న జూనియర్ విభాగంలో 6, 7 తరగతి విద్యార్థులకు, సీనియర్ విభాగంలో 8, 9, 10 విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆసక్తి గల విద్యార్థులను గుర్తించడం జరిగిందన్నారు. 
 
నవంబర్ 14వ తేదీన  నిర్వహించే క్విజ్ పోటీలను  ఒక స్కూల్ నుంచి  4 గురు చొప్పున మాత్రమే  జూనియర్, సీనియర్ విభాగంలో పోటీలను నిర్వహిస్తున్నట్లు త్రినాధ్ తెలిపారు.
 
15న స్వాతంత్ర్య స్ఫూర్తి సందేశం ఇచ్చే దేశభక్తి గీతాలు పోటీలు, 16న వ్యాసరచన లో భాగంగా జూనియర్ లకు "నాకు నచ్చిన జాతీయ నాయకుడు" , " సీనియర్ విభాగంలో భారత దేశం స్వాతంత్ర్య ఫలాలు పొందుతోందా?" అంశంపై పోటీలు జరుగుతాయన్నారు.
 
17న వకృత్వ పోటీల్లో జూనియర్ లకు "నాకు నచ్చిన జాతీయ నాయకుడు" , సీనియర్ విభాగంలో " ఆధునిక భారత నిర్మాణం లో యువత పాత్ర ' అంశంపై పోటీలు జరుగుతాయన్నారు
 
18న చిత్రలేఖనం విభాగంలో జూనియర్ లకు "మీకు నచ్చిన జాతీయ చిహ్నం" , సీనియర్ విభాగంలో "మీకు నచ్చిన జాతీయ నాయకులు" అంశంపై చిత్ర లేఖనం పోటీలు నిర్వహిస్తున్నా మన్నారు.  19న విద్యార్థిని లకు మాత్రమేకాగితం పై  ముగ్గుల పోటీలు ఉంటాయని తెలిపారు. 

20న  గ్రంధాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పోటీలో గెలుపు పొందిన విద్యార్థిని విద్యార్థులకు వారోత్సవాలు ముగింపు సందర్భంగా స్థానిక జిల్లా గ్రంధాలయం శాఖ లో ఉదయం 11 గంటలకు బహుమతులు అందచేస్తామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగసంఘాల నేతలు కొత్తగా పొందే అవమానాలేం ఉండవు: పరుచూరి అశోక్ బాబు