దుర్గం చెరువు బ్రిడ్జ్‌కి ఆనుకుని ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పైన ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు నెంబర్ 45 వైపు నుండి ఐటీసీ కోహినూర్ వైపు స్ప్లెండర్ బండి పైన శివ, ప్రశాంత్, విజయ్ అనే ముగ్గురు యువకులు మద్యం మత్తులో వస్తుండగా బ్రిడ్జ్ చివరలో బండి అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని బండి నడుపుతున్నశివ ప్రశాంత్ మరియు విజయ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శివ మేడి కవర్ ఆసుపత్రిలో మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక వీరు ముగ్గురు విద్యార్థులని అందరూ యూసుఫ్ గూడలో ఉంటాని సమాచారం. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదం అని తెలిసినా కూడా లైసెన్సు కూడ లేని శివను బండి నడిపేలా ప్రోత్సహించి ప్రమాదానికి కారణమైన ప్రశాంత్, విజయ్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.