Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నూతన బీ2బీ నిర్దిష్టమైన విద్యుత్‌ బైక్‌: టీబైక్‌ ఒన్‌ ప్రోను ఆవిష్కరించిన స్మార్ట్రాన్

నూతన బీ2బీ నిర్దిష్టమైన విద్యుత్‌ బైక్‌: టీబైక్‌ ఒన్‌ ప్రోను ఆవిష్కరించిన స్మార్ట్రాన్
, సోమవారం, 7 డిశెంబరు 2020 (19:36 IST)
హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన స్మార్ట్రాన్ ఇండియా, తమ ప్రతిష్టాత్మక క్రాస్‌ ఓవర్‌ స్మార్ట్‌ ఇ-బైక్‌ - టీబైక్‌ ఒన్‌ ప్రోను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. అత్యధిక ఆర్‌ఓఐ మరియు క్లౌడ్‌ కనెక్టడ్‌ ఆఫరింగ్‌తోధృడమైన ఫీచర్లను అందించే రీతిలో తీర్చిదిద్దిన ఈ బైక్‌ను ప్రత్యేకంగా భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న షేర్డ్‌/బీ2బీ ఇ-బైక్‌ విభాగం కోసం తీర్చిదిద్దారు.
 
స్మార్ట్‌ మరియు ఆకట్టుకునే విద్యుత్‌ బైక్‌లపై అనుభవపూర్వక టూర్లను అందించే సుప్రసిద్ధ ట్రావెల్‌ టెక్‌ వేదిక బీలైవ్‌తో వ్యూహాత్మక ఒప్పందం చేత ఇది వచ్చింది. స్మాట్రాన్ ఇప్పుడు భారతదేశంలో తాము ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న 14 నగరాలలో కస్టమైజ్డ్‌ స్మార్ట్‌ క్లౌడ్‌ కనెక్టడ్‌ ఇ-బైక్‌లను అందిస్తుంది.
 
తన సిగ్నేచర్‌ డిజైన్‌ మరియు విభిన్నమైన పనితీరుతో ట్రాన్‌ఎక్స్‌ ప్లాట్‌పామ్‌ శక్తితో స్మార్ట్‌ మరియు తెలివిగా తుది మైలు కనెక్టివిటీని పునర్నిర్వచించడానికి టీబైక్‌ ఒన్‌ ప్రో సిద్ధంగా ఉంది. ఇది లాజిస్టిక్స్‌ మరియు లీజర్‌ వ్యాపారాలు అయినటువంటి రిసార్ట్స్‌, రైడ్-షేర్‌, ఇ-కామర్స్‌, డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌, ఇ-ఫార్మసీలు, ఇ- గ్రాసరీలకు సేవలను అందించనుంది. టీబైక్‌ ఒన్‌ ప్రోను మొదటి తరపు టీబైక్‌పై నిర్మించారు. ఇది గణనీయంగా యాజమాన్య నిర్వహణ ఖర్చును తమ తగ్గించబడిన నిర్వహణ, కార్యాచరణ, కార్బన్‌ పాదముద్రలతో తగ్గిస్తుంది. విశ్వసనీయమైన లిథయం బ్యాటరీ శక్తి కారణంగా రైడర్లు, తమ సవారీని చార్జింగ్‌ అయిపోతుందన్న బాధ లేకుండా ఎక్కవకాలం కొనసాగించవచ్చు.
 
మహేష్‌ లింగారెడ్డి, ఫౌండర్‌ అండ్‌ ఛైర్మన్‌, స్మాట్రాన్ మాట్లాడుతూ, ‘‘తెలివైన మరియు కనెక్టడ్‌ ఇ-బైక్‌, టీబైక్‌ ఒన్‌ ప్రో. ఇది వినూత్నమైనది మరియు విప్లవాత్మక రీతిలో రైడర్లకు మెరుగైన ప్రయాణ అనుభూతులను అందిస్తుంది. ఇది సరళమైనది మరియు నిర్వహించేందుకు అతి సులభమైనది. నగరంతో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో అన్వేషించడానికి ఇది సహాయపడుతుంది. తుది మైలు కనెక్టివిటీకి అసాధారణ విలువను ఇది అందిస్తుంది.
 
భారతదేశంతో పాటుగా ప్రపంచం కోసం భారతదేశంలో రూపకల్పన చేసి తీర్చిదిద్దడం పట్ల మేము గర్వంగా ఉన్నాము. ట్రాన్‌ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌ శక్తితో మరిన్ని ఈవీ ఉత్పత్తులను విడుదల చేయడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఇవి తుది మైలు కనెక్టివిటీ అవసరాలను తీర్చనున్నాయి. మొదటి తరపు టీబైక్‌ ఒన్‌, భారతదేశంతో పాటుగా భూటాన్‌, మెక్సికో మరియు యుఎస్‌ఏ లాంటి దేశాలలో ఆదరణ పొందింది’’ అని అన్నారు.
 
ట్రాన్స్‌ శక్తితో టీబైక్‌ ఒన్‌ ప్రో రూపొందించబడింది. ఈ ఏఐఓటీ వేదిక, పలు స్మార్ట్‌ మరియు ఇంటిలిజెంట్‌ ఫీచర్లను ఈ–ఫ్లీట్‌ యజమానులు, రైడర్లు మరియు లీజ్‌ కంపెనీలకు  అందిస్తుంది. ఈ ఫీచర్లు, వినియోగానికి సంబంధించి వాస్తవ సమయంలో వినియోగానికి సంబంధించిన అంశాలైనటువంటి తిరిగిన దూరం, వినియోగలక్షణాలు, ధారణ మరియు బృంద అంచనాలు వంటివి టీబైక్‌ యాప్‌లో ఒడిసిపట్టబడతాయి. ఇది రిమోట్‌ లాక్‌ మరియు అన్‌లాక్‌తో పాటుగా వాహనాన్ని గుర్తించడం కూడా చేస్తుంది.
 
అనూప్‌ నిశాంత్‌, సీఈవో  ట్రాన్స్క్‌ మోటార్స్‌, స్మాట్రాన్‌కు చెందిన ఇ-బైక్‌ కంపెనీ మాట్లాడుతూ, ‘‘కేవలం జీవనశైలి ఆధారిత ఈవీ సాంకేతికత కాకుండా అంతకుమించి టీబైక్‌ ఒన్‌ ప్రోను ఆవిష్కరించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. భారతీయ వినియోగదారుల అంచనాలను అందుకునే రీతిలో స్మార్ట్‌ ఫీచర్లతో ఇ-బైక్‌ వస్తుంది మరియు ఈవీ స్వీకరణ పరంగా అన్ని అవరోధాలనూ ఇది అధిగమిస్తుంది. భారతదేశపు ఆటోమోటివ్‌ విద్యుతీకరణ ప్రయాణం పట్ల మేము విశ్వాసంతో ఉన్నాము మరియు ఈ ప్రయాణంలో భాగం కావాలని మేము కోరుకుంటున్నాము. తద్వారా స్థిరమైన మరియు బాధ్యతాయుతమైన మొబిలిటీ పరిష్కారాలను భారతదేశం కోసం అభివృద్ధి చేయడంలో మా నిబద్ధతను ప్రదర్శిస్తున్నాం’’ అని అన్నారు.
 
సందీప్‌ ముఖర్జీ, కో-ఫౌండర్‌ అండ్‌ సీఓఓ, బీలైవ్‌ మాట్లాడుతూ, ‘‘ టీబైక్‌ ఒన్‌ ప్రో కోసం స్మారా్ట్రన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. బైక్‌ యొక్క చార్జింగ్‌ పరంగా ఉన్న ఫ్లెక్సిబిలిటీ మరియు ఇతర అద్భుతమైన  ఫీచర్లు దీనికి కారణం.  బీలైవ్‌ టూర్‌ అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలిగించని అనుభవాలను మేము అందిస్తున్నాము. మా అతిథులు లీనమయ్యే అనుభవాలను ఆస్వాదించవచ్చు. సాధారణంగా వారెప్పుడూ వీక్షించని ప్రాంతాలను వారు వీక్షించడంతో పాటుగా ప్రకృతికి మరింత దగ్గరయ్యేందుకు మరియు స్థానిక సంస్కృతిలో పర్యావరణ అనుకూల మార్గంలో మిళితమయ్యేందుకు తోడ్పడుతుంది’’అని అన్నారు.
 
భారతదేశంలో  రూపకల్పన చేసి తయారుచేసిన టీబైక్‌ ఒన్‌ ప్రో, రేపటికి సిద్ధంగా ఉన్న బైక్‌. ఇది శక్తివంతమైన సవారీ అనుభవాలను, వినూత్నంగా డిజైన్‌ చేసిర సెన్సిబిలిటీతో మిళితం చేసి అందిస్తుంది. దేశవ్యాప్తంగా పలు నగరాలలో స్మారా్ట్రన్‌ యొక్క టీకేర్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సర్వీస్‌ మరియు రక్షణ లభ్యమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేపాల్: రాచరికం, హిందూ రాజ్యం పునరుద్ధరించాలంటూ ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి?