Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ వైసీపీ అధ్యక్షురాలిగా షర్మిల? డిసెంబర్ 21న ప్రకటిస్తారా? (Video)

తెలంగాణ వైసీపీ అధ్యక్షురాలిగా షర్మిల? డిసెంబర్ 21న ప్రకటిస్తారా? (Video)
, గురువారం, 17 డిశెంబరు 2020 (23:22 IST)
డిసెంబర్ 21న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఆ రోజునే ఆయన సోదరి షర్మిల నాయకత్వంలో వైకాపా బాణాన్ని తెలంగాణ రాజకీయాలపైకి సంధిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ యువ కెరటం, రాజన్న గారాల పట్టి, ఏపీ సీఎం జగన్ చెల్లెలు, తెలంగాణ ఫ్యూచర్ ఐకాన్ వైఎస్ షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ తెలంగాణకు చెందిన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున టీవీలో ప్రకటనలు ఇచ్చారు. దీంతో వైఎస్ షర్మిల రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారని, తెలంగాణ వైసీపీ అధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తారనే అంశానికి మరింత బలం చేకూరుతోంది.
 
అలాగే వైఎస్ షర్మిల పుట్టిన రోజు వేడుకలను తెలంగాణ ఉద్యమ కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు నిర్వహించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించాలని వారు కోరుతున్నారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జరగడం లేదని, ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరహాలో తెలంగాణలో కూడా సంక్షేమం, ఉద్యోగాల భర్తీ వేగంగా జరగాలంటే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ బాధ్యతలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
 
తెలంగాణలో కాంగ్రెస్ ప్రస్తుతం బలహీనమైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికీ తమ నేతగా కొలుస్తారు కొందరు కాంగ్రెస్ నేతలు. వైఎస్ఆర్ జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహిస్తారు. తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, జగన్‌ను అభిమానించే జనం, ఓటర్లు ఉన్నారు. జగన్ కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కావడంతో వారంతా జగన్ పరోక్షంగా మద్దతు పలికే టీఆర్ఎస్ పార్టీకి జై కొడుతూ వస్తున్నారు.
 
ప్రస్తుతం కాంగ్రెస్ బలహీనపడుతోంది. బీజేపీ పుంజుకుంటోంది. టీఆర్ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. వైఎస్‌ను అభిమానించే కాంగ్రెస్ కార్యకర్తలను, ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఓటు కేవలం బీజేపీకి మాత్రమే పడకుండా మరో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది.
 
ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావాలని సలహా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ విషయంపై షర్మిల పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీనిపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజున ఏదైనా ప్రకటన వస్తుందేమో వేచి చూడాలి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొండేలెజ్ ఇండియా బోర్న్‌విటా క్రంచీ ప్రారంభం