తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈనెల 17వ తేదీన రాష్ట్రానికి అమిత్ షా రానున్నట్లు ఎంపీ సోయం బాపూరావు ప్రకటించారు.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వద్ద సభకు భాజపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్ పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు.
ఈ సభలో అమిత్‌షా తో పాటు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఇతర నేతలు పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు.
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రి చెట్టు దగ్గర రజాకార్లు ఊచకోత కోశారని చరిత్ర చెబుతోంది. అరాచకానికి, రాక్షసత్వానికి సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతం దగ్గరే తెలంగాణ స్వేచ్ఛా సంబురాలు నిర్వహించాలని బీజేపీ డిసైడైంది.