తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్లో 250 ఎకరాల లో చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టును సుందర నందనవనం ప్రాజెక్టుగా తీర్చిదిద్దామని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
బుద్ధవనం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ నలుమూలలు, దక్షిణ ఆసియా దేశాల నుండి పర్యాటకులను ఆకర్షించే విధంగా తుదిమెరుగులు దిద్దుతున్నమని తెలంగాణ బౌద్ధ వారసత్వాన్ని, ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలలోని బౌద్ధ కట్టడాలను, బుద్ధుని జీవిత చరిత్ర, జాతక కథలు, బౌద్ధ చరిత్ర మరియు బౌద్ధ పునర్జీవన చరిత్రలను సందర్శకులకు వివరించడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
బుద్ధ వనం ప్రధాన ముఖద్వారము, మహా స్తూపం పైన అలంకరించిన బౌద్ధ శిలాఫలకాల వివరాలనూ బౌద్ధ పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆయనకు వివరించగా, ఆయా శిలాఫలకాలు చెందిన సూచిక పలకలను ఏర్పాటు చేయాలని సూచించారు.