హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ విమానాశ్రయంలో ఈ నెల 24వ తేదీన ఎయిర్ షో జరుగనుంది. 'వింగ్స్ ఇండియా-2022' జరుగనుంది. 22వ తేదీన ప్రారంభమై 27వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతుంది.
ఈ ఎయిర్ షోలో దేశ విదేశాలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్ ఫైట్లు, హెలికాఫ్టర్లను ప్రదర్శనకు ఉంచుతారు. 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాలుపంచుకోనున్నారు. అలాగే, ఆరు వేల మంది వ్యాపారులు, 50 వేలమందికిపైగా సందర్శకులు ఈ ఎయిర్ షోకు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ ప్రదర్శనకు రావాలనుకునేవారు వింగ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. తొలి మూడు రోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. ప్రదర్శన చివరి రోజైన 27వ తేదీన సాధారణ ప్రజలను అనుమతించేలా ఏర్పాటు చేశారు.
అయితే, సాధారణ ప్రజలు ఈ సందర్శనను చూసేందుకు రూ.500ను ప్రవేశరుసుంగా నిర్ణయించడం ప్రతి ఒక్కరినీ తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.