Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో మళ్లీ చిరుత కలకలం

Advertiesment
హైదరాబాద్‌లో మళ్లీ చిరుత కలకలం
, మంగళవారం, 9 జూన్ 2020 (09:53 IST)
హైదరాబాద్‌లో మళ్లీ చిరుత కలకలం రేపుతోంది. దీంతో రాజేంద్రనగర్‌ ఏరియా అక్కడి ప్రజలకు  కంటిమీద కునుకు లేకుండాపోయింది.

రాజేంద్రనగర్ సమీపంలోని వ్యవసాయ యూనివర్శిటీ పరిసరాల్లో చిరుత సంచరించగా.. ఓ ఇంటి కాంపౌండ్‌లోకి వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది.

మే 14న కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై కనిపించగా.. స్థానికుల్ని చూసి భయంతో రోడ్డుపై పరుగులు తీస్తూ వెళ్లి ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేసింది. అక్కడి నుంచి మెల్లిగా జారుకుని సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌వైపు వెళ్లింది.

ఆ తర్వాత రెండు వారాల క్రితం రాజేంద్రనగర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మళ్లీ చిరుత పులి జాడ కనిపించింది.

అక్కడి నుంచి అది గగన్‌పహాడ్‌ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ రాజేంద్రనగర్ ప్రాంతంలోనే ఓ ఇంటి కాంపౌండ్‌లో కనిపించి అందరినీ భయపెడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జున యూనివర్సిటీ పరీక్షల షెడ్యూలు ఖరారు