Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరీంనగర్​లో నామినేషన్ల స్వీకరణ

Advertiesment
కరీంనగర్​లో నామినేషన్ల స్వీకరణ
, శనివారం, 11 జనవరి 2020 (03:25 IST)
పురపాలక ఎన్నికల్లో అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఖర్చులకు పాత బ్యాంకు ఖాతాలని సూచించింది. దీంతో పాటు కరీంనగర్​ నగరపాలక సంస్థకు 24న ఎన్నికలు, 27న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు వెల్లడించింది.

కరీంనగర్​ నగరపాలక సంస్థకు ఈనెల 24న ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఓట్ల లెక్కింపు ఈ నెల 27న చేపడుతారు. వార్డుల పునర్విభజన సక్రమంగా జరగలేదనే నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులతో ఈనెల 7న కరీంనగర్​ నోటిఫికేషన్​ వెలువడలేదు.

కాగా ఎన్నికలకు హైకోర్టు గురువారం పచ్చ జెండా ఊపింది. దీంతో ఎస్​ఈసీ నోటిఫికేషన్​ ఇచ్చింది. దీనికి అనుగుణంగా కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల అధికారి నోటిఫికేషన్ ఇచ్చి ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
 
నిజామాబాద్​లో నామినేషన్​ వేసిన హిజ్రా
తామేమీ తక్కువ కాదంటూ ఓ హిజ్రా కార్పొరేషన్​ ఎన్నికల్లో నామినేషన్​ వేసింది. నిజామాబాద్​ కార్పొరేషన్​ 16 డివిజన్​కు జరీనా అనే హిజ్రా నామ పత్రాలు దాఖలు చేసింది. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్​గా పోటీ చేసేందుకు ఓ హిజ్రా ముందుకు వచ్చింది.

16 డివిజన్ అభ్యర్థిగా జరీనా అనే హిజ్రా నామినేషన్​ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలు అందజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాని జరీనా తెలిపారు. ఇప్పటి వరకు ఏ పార్టీ నాయకులు కూడా ప్రజలకు చేసిందేమీ లేదని ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్​