ప్రేమించిన అమ్మాయి మరొక వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందనే ఆగ్రహంతో ప్రియుడు ఆమెను అపహరించుకుపోయిన ఘటన హైదరాబాదు నగరంలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్టేడ్స్‌ను పరిశీలిస్తే.. ఈ ఘటనపై యువతి తండ్రి దామోదర్ రెడ్డి ఫిర్యాదుతో ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్ రెడ్డి అతడి అనుచరులతో ఆదిభట్ల పోలీసులు హత్యాయత్నం, అపహరణ దాడితో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కేంద్రంలో నవీన్‌కు తన కుమార్తెతో పరిచయం ఏర్పడిందని యువతి తండ్రి తెలిపాడు.
ప్రేమ పెళ్లి పేరుతో తన కుమార్తెను వేధించాడని.. ఇంటిపై దాడి కూడా చేశారన్నాడు. దాడి తర్వాత తన కుమార్తెను బలవంతంగా కారులో ఎక్కించుకుని ఎత్తుకెళ్లారు. తన కుమార్తె విషయంలో మొదటి నుంచి నవీన్ రెడ్డి సైకోలా వ్యవహరించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఎన్నో డ్రామాలు ఆడాడు.
పెళ్లి జరిగిందని కూడా నమ్మబలికాడు. పెళ్లి జరిగిన మాట అవాస్తవమని.. ఫోటోలతో అతడు బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఇక యువతి కిడ్నాప్ ఉదంతంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా.. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో కిడ్నాప్‌కు గురైన యువతిని పోలీసులు కాపాడారు. ఆరు గంటల్లోనే యువతిని రక్షించి.. తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని.. నవీన్ అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.