మంచు లక్ష్మి అదుర్స్ అనిపించింది. తెలంగాణ నిర్వహిస్తున్న మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంచు లక్ష్మి తన టెక్ ఫర్ చేంజ్ సంస్థతోనే 50 స్కూళ్లు దత్తత తీసుకుంటానని ఒప్పందం చేసుకుంది.
ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిస్తామని, 1 నుంచి 5 తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తూనే, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని, ఆ స్కూల్స్‌లో కనీస అవసరాలు ఏర్పాటు చేస్తామని మంచు లక్ష్మి తెలిపింది.