Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022: రెండవ ఎడిషన్‌లో పాల్గొన్న 3 వేల మంది

webdunia
సోమవారం, 7 మార్చి 2022 (21:25 IST)
ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ తమ రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022ను ఆదివారం, దుర్గం చెరువు కేబుల్‌ వంతెన దగ్గర విజయవంతంగా నిర్వహించింది. స్పోర్ట్స్‌ బ్రాండ్‌ పూమా మద్దతుతో నిర్వహించిన ఈ సంవత్సరపు 21కెరన్‌కు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ స్టీఫెన్‌ రవీంద్ర, ఐపీఎస్‌, జెండా ఊపి ప్రారంభించగా,  10కెరన్‌కు  తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య(ఐ అండ్‌ సీ), ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) శాఖల ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌, ఐఏఎస్‌; 5కె రన్‌కు తెలంగాణా రాష్ట్ర, పురపాలక- నగరాభివృద్ధి శాఖల ప్రత్యేక కార్యదర్శి శ్రీ అర్వింద్‌ కుమార్‌, ఐఏఎస్‌లు జెండా ఊపి ప్రారంభించారు.

 
దివ్యాంగుల కోసం నిర్వహించిన మారథాన్‌కు స్త్రీ, మహిళ, దివ్యాంగ- సీనియర్‌ సిటిజన్‌ శాఖల సెక్రటరీ కమిషనర్‌ శ్రీమతి దివ్య దేవరాజన్‌, ఐఏఎస్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంవత్సరపు ఐడీసీఆర్‌ 2022లో విభిన్న వర్గాలు, వయసు విభాగాలకు చెందిన దాదాపు 3 వేల మంది పాల్గొన్నారు. ఈ రన్‌లో 90 మంది దివ్యాంగులు పాల్గొనడంతో పాటుగా దుర్గం చెరువు కేబుల్‌ వంతెనపై 100 మీటర్లు నడవడం ద్వారా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలిగించారు.

 
ఇనార్బిట్‌ మాల్‌ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రన్‌లో పాల్గొన్న ఇతర ముఖ్య అతిథుల్లో శ్రీమతి ప్రియాంక ఆల,  ఐఏఎస్‌; శ్రీ కె శిల్పవల్లి, డిప్యూటీ డీసీపీ, సైబరాబాద్‌ పోలీస్‌; ఐటీ శాఖ ముఖ్య సంబంధాల అధికారి శ్రీ అమర్‌నాథ్‌ రెడ్డి;  కెఆర్‌సీ హెడ్‌ శ్రీ శ్రవణ్‌ గోనె తదితరులు పాల్గొన్నారు. ఈ రన్‌కు నిర్మాణ్‌ డాట్‌ ఓఆర్‌జీ  ఎన్‌జీవో మద్దతునందించింది. ఈ సంస్థ దివ్యాంగులకు నైపుణ్యాభివృద్ధి కల్పించడంతో పాటుగా  వారిని ఉద్యోగార్హులుగానూ మారుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 30 లక్షల రూపాయలను సమీకరించారు.

 
‘‘రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ హైదరాబాద్‌ హాఫ్‌ మారథాన్‌ను అధిక సంఖ్యలో పాల్గొన్న అభ్యర్థులతో నిర్వహించడం మాకు గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమం కోసం మద్దతునందించిన మా భాగస్వాములు, న్రభుత్వ అధికారులకు ధన్యవాదములు తెలుపుతున్నాము. అత్యంత కఠినమైన కోవిడ్‌ భద్రతా మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని  దీనిని నిర్వహించాము. ఈ మహోన్నత కార్యక్రమానికి సైబరాబాద్‌ పోలీసులు అపూర్వమైన సహకారం అందించారు. ఈ రన్‌లో ఉత్సాహంగా పాల్గొనడంతో పాటుగా ఫిట్‌గా ఉండేందుకు మరింతమందికి స్ఫూర్తి కలిగించిన వారందరికీ  మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ తరహా మరిన్ని కార్యక్రమాలను భవిష్యత్‌లో మరింతగా కొనసాగించనున్నాము’’ అని శరత్‌ బెలావడి, సెంటర్‌ హెడ్‌, ఇనార్బిట్‌ మాల్‌, హైదరాబాద్‌ అన్నారు.

 
ఈ ఐడీసీఆర్‌ 2022కు అప్పెరల్‌ బ్రాండ్‌ లైఫ్‌స్టైల్‌ ప్రైజ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తే, రేడియో పార్టనర్‌గా ఫీవర్‌ ఎఫ్‌ఎం, టైమింగ్‌ పార్టనర్‌గా రమేష్‌ వాచ్‌ కో, హైడ్రేషన్‌ భాగస్వామిగా కిన్లే, జ్యువెలరీ భాగస్వామిగా బ్లూస్టోన్‌, బ్రేక్‌ఫాస్ట్‌ భాగస్వామిగా పంజాబ్‌ బిస్ట్రో, మెడికల్‌ పార్టనర్‌గా కాంటినెంటల్‌ హాస్పిటల్‌, బేవరేజ్‌ భాగస్వామిగా చాయ్‌ పాయింట్‌, కుకీ పార్టనర్‌గా కుకీ మెన్‌,  రియల్‌ ఎస్టేట్‌ భాగస్వామిగా రహేజా గ్రూప్‌, ఎకో-సిస్టమ్‌ భాగస్వామిగా హైసియా వ్యవహరించాయి. ఈ రన్‌కు నగరాభివృద్ధి మరియు ఎంఏ; డబ్ల్యుసీడీ, హెచ్‌ఎండీఏ, ఎస్‌సీఎస్‌సీ మరియు టీఎస్‌ఐఐసీలు మద్దతునందించాయి. ఏఐఐఎంఎస్‌ ఈ రన్‌ను సర్టిఫై చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Exit Poll: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే..?