హైదరాబాద్ నగరంలోని పటాచెరు బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థునులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ గురుకుల పాఠశాలకు చెందిన బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెదుతున్నారు.
అస్వస్థతకు లోనైన విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఈ ముగ్గురిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు లోనైన విద్యార్థులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ణయించారు.
కాగా, ఇటీవల ఈ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల్లో ఇప్పటికే 37 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇపుడు 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనుకావడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది.