Publish Date: Wed, 04 Mar 2020 (07:54 IST)
Updated Date: Wed, 04 Mar 2020 (07:55 IST)
మూడేళ్ల చిన్నారి బాడీలోంచి 11 సూదులు బయటపడ్డాయి. అవి శరీరంలోకి ఎలా వెళ్లాయి? ఎవరైనా జొప్పించారా? అనేది తెలియలేదు.
వనపర్తి జిల్లా వీపనగండ్లకు చెందిన పెబ్బిటి అశోక్, అన్నపూర్ణలకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. కుమారుడు లోక్ నాథ్(3) ఈ మధ్య తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు.
వారం కిందట తల్లిదండ్రులు ఆ చిన్నారికి స్నానం చేయిస్తుండగా ఒక సూది మజిల్ లోంచి బయటకు చొచ్చుకురావడంతో హాస్పిటల్కు తరలించారు.
డాక్టర్లు స్కాన్ చేయగా, నడుము కింది భాగంలో 11 సూదులు ఉన్నట్లు తేలింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఎవరో కావాలనే ఇలా చేశారని ఆరోపించారు. చిన్నారిని చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి పంపించామని, కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.