Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. బాలికలదే పైచేయి..

Advertiesment
inter results
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలను ఆదివారం వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ ఇంటర్‌లో 66.2 శాతం, ద్వితీయ ఇంటర్‌లో 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఈ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.
 
ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,89,123 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74.4 కాగా.. బాలురు ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది. 
 
అలాగే, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలకు మొత్తంగా 5,07,948 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,58,490 మంది (70.58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 78.65గా ఉండగా.. బాలురు ఉత్తీర్ణత 62.50 శాతంగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 
 
2025లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత 66.91 శాతం కాగా.. ఈసారి 66.94%గా నమోదైంది. 2025లో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 72.43కాగా.. ఈ ఏడాది 75.61 శాతంగా నమోదైంది.
 
అదేసమయంలో సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ని కూడా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఏప్రిల్ 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లింపునకు ఏప్రిల్‌ 13 నుంచి 20 వరకు అవకాశం ఇచ్చారు. 
 
మే 13 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ప్రాక్టికల్ పరీక్షలు మే 22న ప్రారంభమవుతాయి. ఇవీ రెండు సెషన్లలో నిర్వహిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యూహాత్మకంగా ఇరాన్‌పై విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్