Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుల బాధ - ఒత్తిడితో విషం తాగిన విద్యుత్ ఉద్యోగి...

Advertiesment
deadbody

ఠాగూర్

, ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (13:55 IST)
అప్పుల బాధ, తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఓ విద్యుత్ ఉద్యోగి విషం సేవించి, ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్, ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చింతల్‌బస్తీలోని స్కైలైన్ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న రావూరి సునీల్ ప్రభాకర్ (40) గన్‌రాక్ విద్యుత్ సబ్ స్టషనులో పని చేస్తున్నాడు. ఆయనకు భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో సునీల్ ప్రభాకర్ గత కొంతకాలంగా విధులకు సక్రమంగా వెళ్ళడం లేదు. 
 
ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఖైరతాబాద్ బస్టాండ్ వద్ద నుంచి ఓ పాదాచారి ఫోను నుంచి సోదరుడికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి సోదరుడు ఫోన్ చేయగా పాదాచారి విషయం చెప్పాడు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న సోదరుడితో.. తాను విషం సేవించానని, తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని బోరున విలపిస్తూ చెప్పాడు. 
 
దీంతో హటాహుటిన మాసాబ్‌ట్యాంకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 2 గంటల తర్వాత తుదిశ్వాస విడిచాడు. శనివారం ఉదయం ఖైరతాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించాడు. అప్పులు పెరిగి, మద్యానికి బానిసై కొద్ది రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బస్టాపులో మహిళకు గుండెపోటు... సీపీఆర్ చేసి రక్షించిన పోలీస్ ఎస్ఐ