Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ నీతులు చెప్పడం హాస్యాస్పదం : అద్దంకి దయాకర్

Advertiesment
Telangana assembly

ఠాగూర్

, ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (20:08 IST)
పార్టీ ఫిరాయింపులపై భారత రాష్ట్ర సమితి (భారాస) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులపై కేటీఆర్ ఇపుడు నీతులు సుద్ధులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉందని, అభివృద్ధి పేరుతో వారు ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ చేసిన విమర్శలపై అద్దంకి దయాకర్ ఒక వీడియో ప్రకటన ద్వారా గట్టిగా బదులిచ్చారు. 
 
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లలో 39 మంది ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను చేర్చుకున్నారని, అప్పుడు కేటీఆర్ నైతికత ఏమైందని ఆయన సూటిగా ప్రశ్నించారు. "మీరు 39 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్సీలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పుడు నీ మొహం ఎటుపోయింది?" అని దయాకర్ నిలదీశారు.
 
నేపథ్యంలో అద్దంకి దయాకర్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మగాడని, దమ్మున్న నాయకుడు కాబట్టే బీఆర్ఎస్‌ను ఎన్నికల్లో ఓడించి కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పంపించారని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దయాకర్ ఆరోపించారు. 
 
ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో సుద్దులు, నీతులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరని ఆయన హితవు పలికారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని దయాకర్ స్పష్టంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు : మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్