Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Advertiesment
lawrence currency notes

ఠాగూర్

, ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (17:56 IST)
ప్రముఖ కొరియోగ్రాపర్, సినీ దర్శకుడు, హీరో, నిర్మాత రాఘవ లారెన్స్ దివ్యాంగ డ్యాన్సర్లకు కరెన్సీతో అభిషేకం చేశారు. తద్వారా తనలోని మానవత్వాన్ని ఆయన మరోమారు చాటుకున్నారు. నిజానికి లారెన్స్ ఎల్లవేళలా సామాజిక సేవలో ముందుంటారన్న విషయం తెల్సిందే. తాజాగా ఆయన యువ డ్యాన్సర్లకు తగిన గౌరవం ఇచ్చారు.
 
డ్యాన్స్ పట్ల వారికున్న అభిరుచిని గుర్తించి, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లారెన్స్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
'నేను డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు, ప్రేక్షకులు నా చొక్కాకు రూ.1 నోట్లు గుచ్చేవారు... పూల దండలు వేసేవారు. అది నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అలాంటి అనుభూతిని నా బాయ్స్‌కు కూడా ఇవ్వాలనుకున్నాను. అందుకే వాళ్లపై నోట్ల జల్లు కురిపించాను. ఇది కేవలం ప్రశంస కాదు, ప్రోత్సాహం కూడా' అని ఆయన పేర్కొన్నారు.
 
లారెన్స్ ప్రోత్సహించిన వారందరూ దివ్యాంగులే అయినా, డ్యాన్స్ కళలో విభిన్నతను చూపిస్తున్న ప్రతిభావంతులు. వారి ప్రతిభను మరింత మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో, అందరి ముందూ వారిని గౌరవించడం ద్వారా స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచారు.
 
'వారిని మీ వేడుకలకు ఆహ్వానించి ప్రదర్శన కల్పించండి. వారి నృత్యం చూస్తే మీరు ఆనందించడమే కాదు, వారి ప్రదర్శన ఎంతో మందికి స్ఫూర్తినివ్వడంతో పాటు సంతోషాన్నీ కలిగిస్తుంది' అని లారెన్స్ సూచించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్