ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
Pahalgam attack పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) పేరు పైన ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ (Hafiz Saeed)ను లేపేస్తాం అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్చల్ చేస్తోంది. 'అతడి తలపైన కోట్ల రూపాయలు రివార్డ్ వుందని మాకు తెలుసు కానీ అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం లక్ష రూపాయలే.
హఫీజ్ సయీద్ మా దేశంలోని అమాయక పౌరులను హతమార్చాడు. ఇక అతడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు' అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. హఫీజ్ సయీద్ ఫోటోపైన రెడ్ ఇంకుతో ఎక్స్ మార్కు పెట్టారు. బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది. ఐతే ప్రస్తుతానికి ఈ గ్యాంగ్ లీడర్ బిష్ణోయ్ జైల్లో వున్నాడు. కానీ ఇతడి అనుచరులు మాత్రం బైటే వున్నారు. ఈ గ్యాంగుకి చెందిన వారు పాకిస్తాన్ దేశంలోకి ప్రవేశిస్తారనీ, హఫీజ్ సయీద్ ను తప్పకుండా మట్టుబెడతారంటూ ఆ పోస్టులో వెల్లడించారు.
26/11 ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాది. ఇతడి పేరు ఎన్నో దాడుల్లో ఉటంకించబడింది. పుల్వామా ఉగ్రవాద దాడి కూడా ఇతడి పనే. హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా పలు దేశాలు ప్రకటించడమే కాకుండా అతడి తలపై వందల కోట్ల రివార్డును వుంచాయి. ఐతే ఈ ఉగ్రవాది పాకిస్తాన్ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు వాదనలు వున్నాయి. ఐతే పాకిస్తాన్ మాత్రం హఫీజ్ సయీదును జైల్లో పెట్టినట్లు చెపుతుంటుంది. కానీ హఫీజ్ మాత్రం అక్కడక్కడ బహిరంగ సభల్లో మాట్లాడుతూ కనబడుతుంటాడు. దీనితో అతడికి పాకిస్తాన్ సకల సౌకర్యాలు కల్పిస్తూ పోషిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.