Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ్యూరిచ్‌ ఎయిర్‌పోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

revanth - sridhar

వరుణ్

, సోమవారం, 15 జనవరి 2024 (20:26 IST)
దావాస్‌ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి స్విట్జర్లాండ్‌లోని పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి.. శాలువా కప్పి సన్మానించారు. 
 
సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు దావోస్ నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు జరుగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మణిపూర్ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తిరిగి ఢిల్లీ చేరుకుని, అర్థరాత్రి 2 గంటలకు స్విస్ ఎయిర్ లైన్స్ విమానంలో స్విట్జర్లాండ్‌కు బయలుదేరి వెళ్లారు. 
 
సీఎం హోదాలో తొలిసారి దావోస్ నగరంలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో ఆయన మాట్లాడుతారని తెలిపారు. చర్చాగోష్ఠిలో వైద్యరంగంపై తన అభిప్రాయాలను రేవంత్ రెడ్డి పంచుకుంటారన్నారు.
 
ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరిగే అత్యున్నతస్థాయి సదస్సులో పాల్గొని అగ్రి - ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిని పరిరక్షించేందుకు వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే అంశంపై రేవంత్ ప్రసంగిస్తారన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలి కోసం ఆడవేషం.. అడ్డంగా దొరికిపోయిన ప్రియుడు