Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియురాలి కోసం ఆడవేషం.. అడ్డంగా దొరికిపోయిన ప్రియుడు

lover - man caught

వరుణ్

, సోమవారం, 15 జనవరి 2024 (20:14 IST)
ప్రియురాలికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చేందుకు సాయం చేయాలని నిర్ణయించుకున్న ఆమె ప్రియుడు.. ఆడవేషం చేసి, చివరకు పరీక్షా హాలులో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫరీదా బాద్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ జనవరి 7వ తేదీన ఆరోగ్య కార్యకర్తల ఉద్యోగ నియామక పరీక్ష నిర్వహించింది. ఆరోగ్య కార్యకర్త ఉద్యోగం కోసం పరంజీత్ కౌర్ అనే అమ్మాయి కూడా దరఖాస్తు చేసుకుంది. ఆమెకు కోట్కాపుర ప్రాంతంలోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు.
 
పరంజీత్ కౌర్‌కు ఆంగ్రేజ్ సింగ్ అనే ప్రియుడు ఉన్నాడు. ఆంగ్రేజ్ సింగ్ తన ప్రియురాలి కోసం రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు ఎలాగైనా ఉద్యోగం రావాలన్న ఉద్దేశంతో, ఆమె తరపున తాను పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాడు. అచ్చం ప్రియురాలిని తలపించేలా కట్టు బొట్టుతో పరీక్షకు హాజరయ్యాడు. పొడవైన జుట్టు, నుదుటన బొట్టు, లిప్ స్టిక్, చేతికి ఎర్రగాజులు, అమ్మాయిలా దుస్తులు ధరించి పరీక్ష హాల్‌కు వెళ్లాడు.
 
అంతా బాగానే ఉంది కానీ, వేలిముద్రల వద్దకు వచ్చేసరికి దొరికిపోయాడు. బయోమెట్రిక్ పరికరంలో అతడి వేలిముద్రలు సరిపోలకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
తానే పరంజీత్ కౌర్ అని నమ్మించేందుకు ఆమె ప్రియుడు ఆంగ్రేజ్ సింగ్ నకిలీ ఓటరు కార్డు, నకిలీ ఆధార్ కార్డును కూడా సృష్టించాడని పోలీసులు తెలిపారు. ఎగ్జామ్ హాల్లో అడుపెట్టే వరకు అతడి ప్లాన్ పక్కాగా సాగిపోయింది. కానీ, బయో మెట్రిక్ వద్దకు వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావించిన పరంజీత్ కౌర్‌కు మొదటికే మోసం వచ్చింది. ఆరోగ్య కార్యకర్త ఉద్యోగానికి ఆమె చేసుకున్న దరఖాస్తును అధికారులు రద్దు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేవైసీ అప్‌‍డేట్ చేయకుంటే డీయాక్టివేట్ : ఎన్.హెచ్.ఏ.ఐ