Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గీతా ఆర్ట్స్ లో ది గర్ల్ ఫ్రెండ్ గా మారిన రశ్మిక మందన్న

Rashmika Mandanna
, సోమవారం, 23 అక్టోబరు 2023 (11:24 IST)
Rashmika Mandanna
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న "ది గర్ల్ ఫ్రెండ్" మూవీ అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చి.ల.సౌ, మన్మథుడు 2 చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉన్నాయి. 'నాదీ అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా...' అంటూ మోషన్ పోస్టర్ వాయిస్ ఓవర్ లో వచ్చిన డైలాగ్స్, రశ్మిక శ్వాసను ఆపి నీటిలో కూర్చుని ఉండటం...మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సలార్, కల్కి 2898 ఏడీ ప్రభాస్ కు హ్యాపీ బర్త్ డే గిఫ్ట్ గా హిస్టరీ క్రియేట్ చేస్తుంది : నిర్మాతలు