Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగోల్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో మార్గం... ఫైనల్ చేసిన సీఎం రేవంత్

Advertiesment
hyderabad metro

వరుణ్

, మంగళవారం, 23 జనవరి 2024 (09:41 IST)
హైదరాబాద్ నగరంలో రెండో దశ మెట్రో మార్గం రానుంది. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఈ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 70 కిలోమీటర్ల మేరక మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు చేయగా, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. ఈ రెండో దశలో కొత్తగా నాలుగు కారిడార్లు నిర్మించనున్నారు. అలాగే, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు మార్గాన్ని పొడగించనున్నారు. 
 
కారిడార్-2లో భాగంగా, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల, ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్ల మేరకు మెట్రో మర్గాన్ని పొడగిస్తారు. కారిడార్-4లో భాగంగా, నాగాలో నుంచి ఎల్పీ నగర్ వరకు మెట్రో మార్గానని నిర్మించనున్నారు. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 29 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. 
 
నాగోల్ - ఎల్బీ నగర్ - చాంద్రాయణగుట్ట - మైలార్‌‍దేవ్ పల్లి మీదుగా విమానాశ్రయానికి ఈ మార్గం చేరుకుంటుంది. కారిడార్-4లో భాగంగా, మైలార్‌దేవ్‌పల్లి నుంచి హైకోర్టు వరకు 4 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు. కారిడార్-5 కింద రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు. రాయదుర్గం - నానక్ రామ్ గూడ - విప్రో జంక్షన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఈ నిర్మాణం ఉంటుంది. కారిడార్-6లో భాగంగా మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 14 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మాణం చేపట్టనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో బరితెగించిన దండగుడు.. ఏడుగురిని కాల్చి చంపేశాడు...