Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

Advertiesment
drugs

సెల్వి

, శుక్రవారం, 17 మే 2024 (13:53 IST)
హైదరాబాద్‌లోని ఎస్‌ఓటీ పోలీసులు నగరంలో అక్రమ డ్రగ్స్‌ కార్యకలాపాలపై మరోసారి ఉక్కుపాదం మోపారు. ఇటీవల కూకట్‌పల్లిలోని శేషాద్రినగర్‌లో నిర్వహించిన దాడుల్లో 3 గ్రాముల ఎంఎంబీఏ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్‌ఓటీ పోలీసులు తులసీనగర్‌లో సోదాలు నిర్వహించారు. 
 
ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తుల నుంచి 45 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం