Publish Date: Fri, 20 Mar 2026 (13:25 IST)
Updated Date: Fri, 20 Mar 2026 (13:26 IST)
తెలంగాణ అసెంబ్లీ వద్ద పాము కలకలం రేపింది. శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీ వెలుపల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ఒక పాము భయభ్రాంతులకు గురిచేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో సిబ్బంది, పోలీసులు తమ సాధారణ విధుల్లో నిమగ్నమై ఉండగా, మీడియా పాయింట్ వద్ద ఒక పాము కనిపించి అందరినీ భయపెట్టింది. వెంటనే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీడియా పాయింట్ వద్దకు పరుగెత్తుకెళ్లి ఆ పామును పట్టుకున్నాడు.
అనంతరం, దానిని అడవిలో వదిలిపెట్టేందుకు గాను అతను దానిని పాముల పట్టుకునేవారికి అప్పగించాడు. ఏమాత్రం తడబడకుండా చాకచక్యంగా ఆ పామును బంధించడంపై అతనిపై ప్రశంసలు గుప్పించారు. పామును పట్టుకోవడంతో అసెంబ్లీ సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.