తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలి ఆరుగురు సజీవ దహనమయ్యారు. వీరిలో కంపెనీ ఎండీ, మేనేజర్ వున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమయంలో భవనంలో 50 మంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే నిజమైతే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.
పేలుడుకి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు భవనంలోని మరో రియాక్టర్ పేలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐతే అగ్నిమాపకదళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలను ఖాళీ చేయించారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.