కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి మధ్య గ్యాప్ ఏర్పడిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్ కి కారణం హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికేనంటున్నారు. తను పంపిన అభ్యర్థుల లిస్టును పక్కన పడేసి కొత్త వ్యక్తికి సీటు ఇవ్వడాన్ని రాజాసింగ్ ఓర్చుకోలేకపోతున్నారట.
ఈ కారణంగా ఆయన ఎన్నికల ప్రచారంకు దూరంగా వుంటున్నారు. తనను సంప్రదించకుండా కనీసం ప్రాధమిక సభ్యత్వం కూడా లేని మాధవీలతకు టిక్కెట్ ఎందుకు ఇచ్చారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అసంతృప్తితో వున్న ఆయన ఇటీవల జరిగిన అమిత్ షా మీటింగులకు గైర్హాజరు అయ్యారు.
హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో గోషా మహల్ కూడా వుంది. మీడియాలో వస్తున్న వార్తల నేపధ్యంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసి ప్రచారానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామనంటూ భాజపా అభ్యర్థి మాధవీలత చెప్పారు.