jagan, pawan, chandrababu
తెలుగు రాష్ట్రంలో అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వాడిగా వేడిగా జరగబోతున్నాయి. అందుకే ఈసారి సినీ సెలబ్రిటీలు దూరంగా వుండబోతున్నారు. చాలామంది వ్యూహాత్మకంగా మౌనంగా వుండాలని నిర్ణయించుకన్నట్లు తెలిసింది. ఇటీవలే సీనియర్ నరేశ్ ఎన్నికల విషయంలో మాట్లాడుతూ... అక్కడ అరాచకం మామూలుగా లేదు. ఈసారి ఎన్నికలు రక్తపాతం మరింత జరగనుందని జోస్యం చెప్పారు. నాకేం భయంలేదు. నేను ఉన్నది వున్నట్లు మాట్లాడతాను. ఈ ఐదేళ్ళలో పాలనకంటే అరాచకాలు ఎక్కువయ్యాయి. నాయకులను గుండె మీద చేయి వేసుకుని నాయకులను చెప్పమనండి అంటూ ఇష్టాగోష్టిగా ఇటీవల కలిసినప్పుడు నరేష్ వివరించారు.
ఇక ఇదిలా వుండగా, పవన్ కళ్యాణ్ కు సైతం ఎవరూ ప్రచారానానికి రావవద్దని ఆయనే స్వయంగా అన్యాపదేశంగా సన్నిహితులకు తెలియజేశారని టాక్ వుంది. ఇటీవలే నిఖిల్ తన మేనమామకు పార్టీ టికెట్ ఇస్తే.. తాను ప్రచారానికి సిద్ధమని ప్రకటించారు. కానీ ఆ తర్వాత సన్నిహితులు, శ్రేయభిలాషుల సూచన మేరకు ఆయన మౌనంగా వుండడమే బెటర్ అని ఫిక్స్అయ్యారు. సినిమాలకూ, రాజకీయాలకు లింకు వుందికానీ. వ్యక్తిగత కెరీర్ కు రాజకీయాలు చాలా ఆటంకాలను గురిచేస్తాయి. ఇందుకు జూ.ఎన్.టి.ఆర్.ను ఉదాహరణగా చెబుతుంటారు. ఇక మురళి మోహన్ కూడా తానూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. అలాగే మహేష్ ఫామిలీ కూడా ఉంటున్నట్లు తెలిపింది.