Publish Date: Tue, 09 Jul 2024 (10:49 IST)
Updated Date: Tue, 09 Jul 2024 (10:51 IST)
సంగారెడ్డి జేఎన్‌టియూ క్యాంపస్‌లో అల్పాహారం కోసం హాస్టల్ మెస్‌కు వెళ్లిన విద్యార్ధులకు షాక్ తప్పలేదు. ఆకలితో టిఫిన్ చేద్దామని వచ్చిన విద్యార్థులు చట్నీలో చిట్టెలుక విహరిస్తుండటం చూసి అవాక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్‌టియూ క్యాంపస్‌లో ఈ ఘటన జరిగింది.
ఉదయం కాలేజీ తరగతులకు వెళ్లే ముందు బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో చట్నీ గిన్నెల్లో ఎలుక చక్కర్లు కొట్టడం చూసి విద్యార్ధులు ఖంగుతిన్నారు. నాలుగైదు రోజుల క్రితం విద్యార్ధులు భోజనం నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు బయట నుంచి తెచ్చుకునే భోజనానికి కూడా భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. చట్నీలో ఎలుక ఈదుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.