Publish Date: Sat, 21 Jun 2025 (15:43 IST)
Updated Date: Sat, 21 Jun 2025 (15:46 IST)
బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలంగాణ వాదులపై దాడి చేయించిన జగన్‌తో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‍కు అంత స్నేహం ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఎవరి జాగీర్ అని రాయలసీమను రతనాల సీమను చేస్తాం అని కేసీఆర్ అన్నారని అడిగారు.
రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు. చేస్తుందే తప్పు మళ్లీ దాన్ని సమర్థించుకోవడానికి హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి విషయంలో తెలంగాణకు ఎలాంటి బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ ఆ రోజు ఇష్టానుసారం మాట్లాడారని.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేతలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆనాడు అధికారంలో ఉండి తెలంగాణ జల వనరులను ఆంధ్రా తాకట్టుపెట్టి, ఇప్పుడు నీతి వ్యాక్యాలు పలుకుతున్నారని అద్దంకి విమర్శించారు.