Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ జాబితా టాప్-10లో హైదరాబాద్

Advertiesment
charminar

సెల్వి

, శనివారం, 13 ఏప్రియల్ 2024 (09:23 IST)
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ టాప్-10లో చోటు దక్కించుకుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా - కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక "రియల్ ఎస్టేట్: ఎ డికేడ్ ఫ్రమ్ 2024"లో  వృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగం ద్వారా 2019 నుండి 2035 వరకు హైదరాబాద్‌కు గణనీయమైన వృద్ధిని అంచనా వేసింది.
 
2018లో, హైదరాబాద్ స్థూల దేశీయోత్పత్తి (GDP) 8.47% వృద్ధి రేటుతో 50.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2035 నాటికి GDP $201.4 బిలియన్లకు చేరుతుందని అంచనా. నివేదిక ప్రకారం, సూరత్ మొదటి స్థానంలో ఉంది.
 
ఆగ్రా - బెంగుళూరు ర్యాంకింగ్‌లో తర్వాతి స్థానంలో ఉంది. హైదరాబాద్ నాల్గవ స్థానంలో ఉంది. ఐటీ పరిశ్రమ కారణంగా బెంగళూరు, పూణె, హైదరాబాద్ వంటి నగరాలు గణనీయమైన రియల్ ఎస్టేట్ బూమ్‌ను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. 2004 నుండి, హైదరాబాద్ $4.836 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకాను చంపిందెవరో పులివెందుల పూల అంగళ్ల వద్ద పంచాయతీ పెడదాం: షర్మిల సవాల్