Publish Date: Tue, 23 Jul 2024 (10:05 IST)
Updated Date: Tue, 23 Jul 2024 (10:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ తీగలను పట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, కుభీర్ మండలం సిర్సెల్లి గ్రామానికి చెందిన జాదవ్ మారుతి(45) తన భూమిని సాగు చేసుకుంటూ, ఆటో నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం కుమార్తె వివాహం, ఇంటి నిర్మాణం కోసం రూ.25 లక్షల వరకు అప్పు చేశాడు.
అయితే, తనకున్న ఐదున్నరెకరాల్లో ఎకరంన్నర భూమి అమ్మగా వచ్చిన రూ.12 లక్షలతో కొంత అప్పు తీర్చాడు. రూ.13 లక్షల అప్పు తీర్చడానికి మిగిలిన నాలుగెకరాలు అమ్మితే కొడుకుకు భూమి ఎలా అని మదనపడిన మారుతి.. సోమవారం పల్సితండాకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి ఆటోతీసుకుని వెళ్లాడు. పల్సితండా సమీపంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ టాన్స్‌ఫార్మర్ తీగలను పట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
వరుణ్
Publish Date: Tue, 23 Jul 2024 (10:05 IST)
Updated Date: Tue, 23 Jul 2024 (10:04 IST)