Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యవసాయ సంక్షోభానికి కారణం కాంగ్రెస్సే.. కేటీఆర్ ఫైర్

ktramarao

సెల్వి

, సోమవారం, 1 ఏప్రియల్ 2024 (22:59 IST)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతతో రాష్ట్రంలో కరువు తెచ్చిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాన్ని ప్రభుత్వం తప్పుగా నిర్వహించిందని, ఆపదలో ఉన్న రైతులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులకు ప్రకృతి కారణం కాదన్నారు. ఈ పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిపెట్టాయని, ప్రకృతి వల్ల కాదని పేర్కొన్నారు.
 
నల్గొండ జిల్లాలో పర్యటించి కొద్దిమంది రైతులతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్లే వ్యవసాయ సంక్షోభం తలెత్తిందని అన్నారు. రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతూ రైతు సమస్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. రైతులను పరామర్శించి హామీ ఇవ్వడంలో విఫలమైన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన సహచరుల చిత్తశుద్ధి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.
 
కాంగ్రెస్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్.. పాలకొండ నుంచి జయకృష్ణ