Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శూన్యం నుండి సునామీ పుట్టదు కేటీఆర్ గారూ... సముద్రం నుండి పుడుతుంది: నెటిజన్ రీ-ట్వీట్

ktrao

ఐవీఆర్

, శుక్రవారం, 29 మార్చి 2024 (13:47 IST)
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలోని భారాస అతలాకుతలమవుతోంది. ఒకవైపు కేసీఆర్ కుమార్తె లిక్కర్ స్కాం కింద అరెస్టైంది. మరోవైపు కీలక నాయకులు వరుసగా పార్టీని వీడి అటు కాంగ్రెస్ లేదా భాజపాలో చేరిపోతున్నారు. సూర్యోదయం అయితే పార్టీకి చెందిన ఏ నాయకుడు ఏం చేస్తాడోనన్న ఆందోళనలో ఆ పార్టీ వున్నది. పార్టీ వదిలి వేరే పార్టీలోకి వెళ్తున్న వారి గురించి మాజీమంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సంచలన ప్రకటన చేసారు.
 
కేటీఆర్ ట్వీట్ ద్వారా ''శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు.
 
ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో  14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం.'' అని పేర్కొన్నారు.
 
కేటీఆర్ ట్వీట్ పైన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ అయితే శూన్యం నుంచి సునామీ పుట్టదు కేటీఆర్ గారూ... సముద్రం నుంచి పుడుతుంది. ఏదో ప్రాస బాగుందని పదాలు వేయకండి అంటూ కామెంట్ చేసాడు. ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవంతంగా తేజస్ ఎంకే1ఏ వెర్షన్ గగన విహారం