Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చలికి చిగురుటాకులా వణికిపోతున్న ఉత్తర తెలంగాణ

Telangana weather, cold wave grips in the state
, శుక్రవారం, 22 డిశెంబరు 2023 (09:36 IST)
ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చలి ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆ ప్రాంతానికి ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యు)లో బుధవారం రాత్రి అతి తక్కువగా 6.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌లో 7.5 డిగ్రీలకు పడిపోయింది. 
 
నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోనూ పలు మండలాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 డిగ్రీల లోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు.
 
ఇదిలావుంటే, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద జరిగిన కారును లారీ ఢీ కొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ప్రమాదం జరిగింది. సంఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. మృతులను ఏటూరునాగారం ప్రాంతానికి చెందిన కాంతయ్య, శంకర్‌, భారత్‌, చందనగా గుర్తించారు. 
 
బాధితులు కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వివరించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు... హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు