Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హస్తినకు వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి

Advertiesment
revanth
, గురువారం, 21 డిశెంబరు 2023 (12:18 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరుగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, కీలక నేతలు సమావేశమవుతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇందులో పార్లమెంట్ ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. 
 
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు, ఎంపీ సీట్ల కేటాయింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
 
తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తో పాటు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్నారు. వాస్తవానికి ఈరోజు జిల్లా కలెక్టర్లతో రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్నారు. అయితే, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ కలవరపెడుతున్న కరోనా... పెరుగుతున్న జేఎన్ 1 వేరియంట్